ప్రధాని మోదీ, రాజ్నాథ్లు తమ లోక్సభ స్థానాల్లో గెలవడంపై దృష్టిసారించాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సూచించారు. ఆ తర్వాతే పశ్చిమబంగాలో విజయంపై కలలు కనాలని విమర్శించారు.
భాజపా నేతలకు రాష్ట్ర సంప్రాదాయలు, ఆచారాలపై అవగాహన లేదని మండిపడ్డారు. పశ్చిమబంగాలో మోదీ, రాజ్నాథ్ల ర్యాలీలు అనంతరం మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
"భాజపా నేతలు పశ్చిమబంగాకు చెందినవారు కాదు. వారికి రాష్ట్ర సంప్రదాయాలపై అవగాహన లేదు. వారికి రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు. పశ్చిమబంగా గురించి ఆలోచించే ముందు వారందరు తమ సొంత రాష్ట్రాలపై శ్రద్ధ పెట్టాలి."
--- మమతా బెనర్జీ, పశ్చిమబంగా ముఖ్యమంత్రి.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం...
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని మమతా స్పష్టం చేశారు. బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
"కేంద్రం పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందే. మేము బిల్లుకు మద్దతివ్వము, మోదీని గెలవనివ్వము."
---- మమతా బెనర్జీ, పశ్చిమబంగా ముఖ్యమంత్రి.