ETV Bharat / snippets

అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల - 35 తులాల బంగారం, 15 తులాల వెండి అపహరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 10:37 AM IST

Thieves robbed in house
Thieves robbed in house (ETV Bharat)

రంగారెడ్ది జిల్లా హయత్​నగర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్నేహితురాలి అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ చేశారు. పసుపులేటి స్వాతి అనే మహిళ హయత్​నగర్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో నివాసం ఉంటుంది. సూర్యాపేటలో చిన్ననాటి ఫ్రెండ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లింది.

తిరిగి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా, తాళం పగులగొట్టి ఉంది. పక్కింటి వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, ఒక మొబైల్​ దోపిడీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ధార్ గ్యాంగ్ పనేనా? వరుస చోరీల పట్ల స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ 3 ఇళ్లలో చోరీ జరగగా, అవి చేసింది మధ్యప్రదేశ్​కు చెందిన ధార్ గ్యాంగ్​గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా వారి పనేనా అనే అనుమానాలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.