ETV Bharat / snippets

బెంగళూరు నుంచి ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా - మాదాపూర్​లో ఐదుగురు నిందితుల అరెస్ట్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 4:26 PM IST

POLICE ARREST SAICHARAN DRUG DEALER
Police Caught Drugs in Madhapur (ETV Bharat)

Police Caught Drugs in Madhapur : మాదాపూర్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్​కి డ్రగ్స్​ తరలిస్తున్న సాయి చరణ్​ అనే వ్యక్తిని టీజీ న్యాబ్​, మాదాపూర్​ పోలీసులు పట్టుకున్నారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చే ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సాయిచరణ్​తో పాటు, డ్రగ్స్​ కొనుగోలు చేస్తున్న మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంలను పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ సాయిచరణ్​ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్​లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్వరి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, స్టార్ట్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.