ETV Bharat / snippets

21 జిల్లాల్లో లోక్​సభ ఎన్నికల కోడ్​ ఎత్తివేత - మిగిలిన 12 జిల్లాకు మినహాయింపు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 8:32 AM IST

Lok Sabha Election Code Conclude in Telangana
Lok Sabha Election Code Conclude in Telangana (ETV Bharat)

Lok Sabha Election Code Conclude in Telangana : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్​ను 12 జిల్లాల్లో మినహా మిగిలిన 21 జిల్లాల్లో ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాసనమండలిలోని వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, మలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్​ కొనసాగనుంది. ఇక్కడ ఎన్నికల కోడ్​ పూర్తిస్థాయిలో ముగిసేవరకు ఉండనుంది. రాష్ట్రంలో నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితాకు కేంద్ర ప్రభుత్వ గెజిట్​ ముద్రణ గురువారం పూర్తికావటంతో ఎన్నికల కోడ్​ను ఎత్తేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.