ETV Bharat / snippets

సీఎం అదనపు కార్యదర్శిగా ఐఏస్ కార్తికేయ మిశ్రా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 7:35 PM IST

ias_karthikeya_mishra
ias_karthikeya_mishra (ETV Bharat)

IAS Karthikeya Mishra as Additional Secretary to CM Chandrababu: ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న కార్తికేయ మిశ్రా ఆర్థికశాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. కార్తికేయ మిశ్రాను రాష్ట్ర సర్వీసుకు పంపాలని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై స్పందిచిన డీఓపీటీ కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపుతూ ఆదేశాలిచ్చింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ అధికారులను రిలీవ్ చేయాల్సిందిగా కొరుతూ కొద్ది రోజుల కిందట కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఐఏఎస్ పీయుష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హాలు రిలీవయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థిక సేవల విభాగం డైరెక్టరుగా పని చేసిన కార్తికేయ మిశ్రా రిలీవై ఏపికి రిపోర్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.