ETV Bharat / snippets

ఉద్యోగుల బదిలీల గడువును పెంచిన ప్రభుత్వం - ఉత్తర్వులు జారీ

Govt Extended Deadline For Transfers of Employees
Govt Extended Deadline For Transfers of Employees (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 2:07 PM IST

Govt Extended Deadline For Transfers of Employees: ఉద్యోగుల బదిలీలకు మరో 15 రోజులపాటు గడువును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 15 వరకూ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెప్టెంబరు 16వ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ శాఖలు బదిలీల విధివిధానాలను రూపొందించుకోకపోవటంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, రోడ్​ &భవనాలు, రవాణా శాఖలకు చెందిన బదిలీ మార్గదర్శకాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విధి విధానాల రూపకల్పలో వివిధ శాఖలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.