ETV Bharat / snippets

ప్రొటెం స్పీకర్​గా గోరంట్ల బుచ్చయ్య- 21న శాసనసభ సభ్యులతో ప్రమాణ స్వీకారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 9:55 AM IST

gorantla_butchaiah_chowdary_as_protem_speaker
gorantla_butchaiah_chowdary_as_protem_speaker (ETV Bharat)

Gorantla Butchaiah Chowdary As Protem Speaker : తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకరుగా వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలంటూ బుచ్చయ్య చౌదరిని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్‌ చేశారు. ఇందుకు ఆయన అంగీకరించారు. రేపు గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా ఎన్నికైన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.