ETV Bharat / snippets

మంత్రి కొండా సురేఖతో రేణు దేశాయి భేటీ - ఎందుకంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 10:03 PM IST

FORMER ACTRESS RENU DESAI
Renu Desai meets Minister Konda Surekha (ETV Bharat)

Renu Desai meets Minister Konda Surekha : ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీతా విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి కొండా సురేఖకు వివరించారు.

తన ఇంటికి వచ్చిన రేణుదేశాయ్‌ను మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్‌కు మంత్రి సురేఖ అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.