ETV Bharat / snippets

గుంతలో చిక్కుకున్న చిరుత సేఫ్​ - 28 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 10:25 AM IST

Forest Department Officials Rescued Leopard Stuck
Forest Department Officials Rescued Leopard Stuck (ETV Bharat)

Forest Department Officials Rescued Cheetah Stuck: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో పది అడుగుల గుంతలో చిక్కుకున్న చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించారు. దాదాపు 28 గంటలపాటు గుంతలో ఉన్న చిరుతకు ఆహారం, నీరు అందించి సురక్షితంగా బయటకు తీసి అటవీశాఖ అధికారులు బంధించారు. చిరుతకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటే నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం గుంతలో చిక్కుకుపోయిన చిరుత పులిని గుర్తించిన పశువుల కాపర్లు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులు చిరుతపులిని రక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.