ETV Bharat / snippets

హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ - అసలేం జరిగిందంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 8:23 PM IST

KCR Rail Roko Case
Ex CM KCR Approached to High Court (ETV Bharat)

Ex CM KCR Approached to High Court Over Rail Roko Case : గతంలో రైల్​ రోకో విషయంలో తనపై నమోదైన కేసులో బీఆర్​ఎస్​ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలంటూ పిటిషన్‌లో కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్‌ రోకోకు కేసీఆర్‌ పిలుపునిచ్చారని కోర్టుకు పోలీసుల నివేదిక ఇవ్వగా, తాను మాత్రం ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని కేసీఆర్​ మండిపడ్డారు. రైల్‌ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఆ కేసుకు ఎలాంటి బలం లేదని పిటిషన్లో తెలిపారు. కాగా 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని కోర్టుకు పోలీసులు నివేదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.