ETV Bharat / snippets

దిల్లీ లిక్కర్ స్కామ్​ - తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు వాయిదా

delhi_liquor_scam
delhi_liquor_scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 5:41 PM IST

MLC Kavitha Bail Denied in Delhi Liquor Scam : దిల్లీ మద్యం విధానం, సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఆగష్టు 5కు వాయిదా వేసింది. మరోవైపు దిల్లీ మద్యం విధానం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్​ను పరిగణనలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు, జులై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచాలని సీబీఐని ఆదేశించింది. చార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని సూచించింది. దిల్లీ మద్యం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న చార్జిషీట్ దాఖలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.