ETV Bharat / snippets

తలుపులమ్మ ఆలయంలో బయటపడిన కొబ్బరికాయ కాంట్రాక్టర్ల కుంభకోణం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 5:20 PM IST

Contractors Scam in Lova Temple
Contractors Scam in Lova Temple (ETV Bharat)

Contractors Scam in Lova Temple: కాకినాడ జిల్లా తుని సమీపంలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయంలో కాంట్రాక్టర్ల కుంభకోణం బయటపడింది. పలువురు పూజా సామాగ్రి కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని భక్తులు అంటున్నారు. పూజా సామగ్రి విక్రయించే వ్యక్తి టెంకాయ కొట్టే ప్రదేశం వద్ద మరో వ్యక్తిని ఏర్పాటు చేసి మోసానికి పాల్పడుతున్నారని భక్తులు తెలిపారు. భక్తుల వద్ద ఉన్న టెంకాయను తీసుకొని తాము కొడతామని చెప్పి కొట్టకుండా జారవిడిచి ముందుగా చేతిలో పెట్టుకున్న సగం కొబ్బరి చెక్కను భక్తులకు ఇస్తున్నారు. జారవిడిచిన కొబ్బరికాయను దుకాణంలో అమ్మటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.