ETV Bharat / snippets

రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్​ రెడ్డి - 2 రోజుల పాటు అక్కడే మకాం!

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 10:28 PM IST

CM Revanth Reddy Delhi Tour Tomorrow
CM Revanth Reddy Delhi Tour Tomorrow (ETV Bharat)

CM Revanth Reddy Delhi Tour Tomorrow : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం(రేపు) దిల్లీ వెళ్లనున్నారు. నేడు సాయంత్రం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీ వెళ్లారు. రేపు సీఎం రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దిల్లీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​లను కలువనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు దిల్లీలోనే వీరు ఉండనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు గురించి పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. అదే విధంగా ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సోమవారం తిరిగి వీరు హైదరాబాద్​కు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.