ETV Bharat / snippets

ఖమ్మం జిల్లాలో అమానుషం - భర్త పెదకర్మ నిర్వహిస్తుండగా భార్యపై దాడి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 1:40 PM IST

Attack on Widow in Khammam
Attack on Widow in Khammam (ETV Bharat)

Attack on Widow in Khammam : భర్త పెదకర్మ చేస్తున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన అమానుష ఘటన ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక పాప. గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్న కారణంగా ఈ జంట విడిగా ఉంటోంది.

11 రోజుల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సోమవారం రోజు భార్య అతడి పెదకర్మ నిర్వహించింది. ఆ సమయంలో భర్త గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వచ్చి ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ మహిళ తల్లిదండ్రులపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.