APCC President Sharmila Comments on Agriculture Department : డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచడంలో కూటమి సర్కార్ విఫలమయ్యిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సాగర్ కుడికాలువ ఆయకట్టు కింద సాగునీరు వచ్చిందని సంతోష పడేలోపే వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం నాలుగు లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారిందన్నారు. క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తెద్దామనే రైతు ఆశను మళ్లీ చంపుతున్నారన్నారు. పోలీసులను కాపలా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కొన్ని టోకెన్లు మాత్రమే ఇచ్చి కౌంటర్లు మూసేయడాన్ని తప్పుబట్టారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలన్నారు. 48 గంటల్లో JGL - 384 రకం విత్తనాలు 15 వేల క్వింటాలు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ విత్తనాన్ని సైతం రాయితీ జాబితాలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
విత్తనాల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలి: వైఎస్ షర్మిల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 10:08 PM IST