ETV Bharat / snippets

ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ గుల్బెంకియన్ అవార్డు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 4:26 PM IST

Updated : Jul 12, 2024, 6:45 PM IST

APCNF Won Gulbenkian Prize
APCNF Won Gulbenkian Prize (ETV Bharat)

APCNF Won Gulbenkian Prize: ఆంధ్రపదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ప్రఖ్యాత గుల్బెంకియన్ అవార్డు లభించింది. అమెరికాకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఏపీసీఎన్‌ఎఫ్‌ (Andhra Pradesh Community Managed Natural Farming) ఈ అవార్డు గెలుచుకుంది.

గుల్బెంకియన్ అవార్డు కింద 1 మిలియన్ యురోల నగదు పురస్కారం లభించనుంది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి రైతు సాధికార సంస్థకు చెందిన ఏపీసీఎన్ఎఫ్ అవార్డు అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాలు, అమల్లో భాగంగా ఏపీ సీఎన్ఎఫ్ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా 181 నామినేషన్​ల నుంచి ఆంధ్రప్రదేశ్ అవార్డు అందుకుంది. ఏపీసీఎన్‌ఎఫ్‌కు అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఏపీ అనుసరించిన జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందన్న సీఎం, అవార్డు సాధించిన సీఎన్‌ఎఫ్, రైతు సాధికార సంస్థకు అభినందనలు తెలిపారు.

Last Updated : Jul 12, 2024, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.