ETV Bharat / snippets

ఈ నెల 29న హైదరాబాద్​లో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ - పోస్టర్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 12:20 PM IST

AP CM Chandrababu Launch NTR Film Awards Poster
AP CM Chandrababu Launch NTR Film Awards Poster (ETV Bharat)

AP CM Chandrababu Unveiled NTR Film Awards Poster : సినీ రంగంలోని అన్ని విభాగాల్లో ప్రఖ్యాతి గాంచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు కళావేదిక, రాఘవ మీడియా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఓ హోటల్​లో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట వేడుకలను నిర్వహిస్తోంది.

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఆవిష్కరించారు. వేడుకలు, అవార్డుల వివరాలు అడిగి తెలుసుకొని నిర్వాహకులను చంద్రబాబు అభినందించారు. అతిరథ మహారథుల సమక్షంలో జరిగే ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలకు సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు హాజరుకావాలని కళావేదిక సంస్థ కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.