ETV Bharat / snippets

11ఏళ్ల కిందటిదే ఆఖరిది- ఇంకా కొనసాగుతున్న నిరీక్షణ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 11:06 AM IST

India Icc Trophy
India Icc Trophy (Source: Getty Images)

India ICC Trophy: టీమ్ఇండియా చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ ముద్దాడి ఆదివారం (జూన్ 23) నాటికి 11 ఏళ్లు పూర్తయ్యింది. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో ఇంగ్లాండ్​ను ఓడించిన టీమ్ఇండియా 5వ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు వన్డే, టీ20 వరల్డ్​కప్​లు ఆడిన భారత్​ 11ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్​లలో ఛాంపియన్​గా నిలవలేకపోయింది. 2014 టీ20 ప్రపంచకప్​, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే వరల్డ్​కప్​ టోర్నీల్లో ఫైనల్​దాకా చేరినప్పటికీ తుదిపోరులో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాగా, ప్రస్తుత టీ20 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. సూపర్​ 8లో రీసెంట్​గా బంగ్లాదేశ్​పై నెగ్గి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఈ టోర్నీలో సెమీస్ చేరడంతోపాటు ట్రోఫీ కూడా సాధిస్తుందని భారత్​ ఫ్యాన్స్ ధీమాగా ఉంది. ఇదే జరిగితే టీమ్ఇండియా 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెర పడినట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.