ETV Bharat / snippets

ఎయిర్ పిస్టల్​లోనూ తప్పిన గురి- నిరాశపర్చిన సరబ్‌జోత్‌, అర్జున్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 4:47 PM IST

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: Associated Press)

Paris Olympics 2024 India: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు తడబడ్డారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్​లో పురుషుల విభాగం సరబ్‌జోత్‌ సింగ్, అర్జున్‌ చీమా నిరాశపర్చారు. ఈ ఈవెంట్లో టాప్- 8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అయితే శనివారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో షూటర్‌ సరబ్‌జోత్‌ 577పాయింట్లతో 9వ స్థానం దక్కించుకున్నాడు. దీంతో త్రుటిలో ఫైనల్​కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు అర్జున్‌ చీమా 574పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమయ్యాడు.

అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఎలవెనిల్‌ వలరివన్‌- సందీప్‌ సింగ్, రమిత- అర్జున్‌ బబుతా జోడీలు నిరాశపర్చాయి. క్వాలిఫికేషన్‌లో ఈ జోడీలు టాప్‌-4కు చేరుకోలేకపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.