ETV Bharat / snippets

రోహిత్ స్మార్ట్ కెప్టెనే- మేము కూడా అన్నింటికి రెడీ: బట్లర్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 4:13 PM IST

Jos Buttler On Rohit Sharma
Jos Buttler On Rohit Sharma (Source: Associated Press)

Jos Buttler On Rohit Sharma: టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే తనకెంతో ఇష్టమని ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అన్నాడు. 2024 టీ20 వరల్డ్​కప్​ రెండో సెమీఫైనల్​కు ముందు స్టార్ స్పోర్ట్స్​తో మాట్లాడిన బట్లర్, రోహిత్​ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'రోహిత్ కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతుంది. గ్రౌండ్​లో రోహిత్ చాలా చురుగ్గా ఉంటాడు. బ్యాటింగ్​, వ్యూహాలతో జట్టును సమర్థంగా నడిపిస్తాడు. అతడి పుల్ షాట్స్​ ఎంజాయ్ చేస్తా' అని బట్లర్ అన్నాడు.

'ఈ మ్యాచ్​లో భారత్ అగ్రెసివ్​గా ఆడడానికి ట్రై చేస్తుంది. అందులో వాళ్లు చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నారు. టీమ్ఇండియా అగ్రెషన్​ ఎదుర్కోడానికి మేం రెడీగా ఉన్నాం. మేము కూడా అంతే అగ్రెసివ్​గా ఆడతాం' అని సెమీఫైనల్ మ్యాచ్​ను ఉద్దేశించి బట్లర్ మాట్లాడాడు. ఇక భారత్- ఇంగ్లాండ్ మధ్య గురువారం సెమీఫైనల్ ఫైట్ ఉండనుంది. ఇందులో నెగ్గి ఫైనల్​కు దూసుకెళ్లాలని ఇరుజట్ల భావిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.