ETV Bharat / snippets

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మృతి- జైషా సంతాపం

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 3:42 PM IST

David Johnson Died
David Johnson Died (Getty Images)

David Johnson Died: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ గురువారం మృతి చెందారు. బెంగళూరులోని తన అపార్ట్​మెంట్​ బయట ఆయన విగతజీవిగా కనిపించారు. అపార్ట్​మెంట్ నాలుగో అంతస్థు నుంచి ఆయన పడిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

'52 ఏళ్ల డేవిడ్ జాన్సన్ కోతనూర్ కనక శ్రీ లేఔట్​లోని తన అపార్ట్​మెంట్ పైనుంచి పడిపోయారు. ​ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్య అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు కూడా లేరు' అని పోలీసులు తెలిపారు. కాగా, కొంతకాలంగా జాన్సన్ అనారోగ్యంతో బాధపడతున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, జాన్సన్​ టీమ్ఇండియా తరపున 1996లో 2 టెస్టు మ్యాచ్​లే ​ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.