ETV Bharat / snippets

మరో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 5:11 PM IST

Updated : Jun 21, 2024, 8:04 PM IST

Assembly_Adjourned_For_Tomorrow
Assembly_Adjourned_For_Tomorrow (ETV Bharat)

Assembly Adjourned For Tomorrow: శాసనసభను రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం పదిన్నర తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాలతో జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయలేదు. వీరి ముగ్గురితో బుచ్చయ్యచౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఉదయం 11 గంటలకు స్పీకర్‌ని ఎన్నుకోనున్నారు. శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట నామినేషన్ దాఖలైంది. అయ్యన్నపాత్రుడు తరఫున ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ దాఖలు చేశారు.

Last Updated : Jun 21, 2024, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.