ETV Bharat / snippets

స్మోకింగ్ వల్ల మెమొరీ లాస్ పక్కా! పరిశోధనలో కీలక విషయాలు!!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 9:29 AM IST

Effects Of Smoking On Cognitive Function
Effects Of Smoking On Cognitive Function (Etv Bharat)

Effects Of Smoking On Cognitive Function : పొగతాగడం వల్ల శారీరక సమస్యలతో పాటు విషయగ్రహణ సామర్థ్యానికీ గండిపడుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ధూమపానం అలవాటులేనివారితో పోలిస్తే వీరికి జ్ఞాపకశక్తి, మాట్లాడే నైపుణ్యం వంటివి క్షీణించడానికి 85 శాతం ఎక్కువ అవకాశం ఉందని వివరించారు. 14 ఐరోపా దేశాల్లో 32 వేల మందిని సర్వే చేసి ఈ అంశాన్ని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశోధనలో భాగంగా పలువురిని 13 ఏళ్ల పాటు పరిశీలించారు. సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా పరీక్షార్థులను వారి ధూమపాన అలవాట్లు, శారీరక శ్రమ తీరు వంటి అంశాల ఆధారంగా భిన్న వర్గాలుగా విభజించారు. వారు స్నేహితులు, కుటుంబసభ్యులను వారంలో ఎన్నిసార్లు కలుస్తారు? మద్యపాన అలవాట్లు వంటి అంశాలనూ విశ్లేషించారు. ధూమపానం అలవాటులేనివారితో పోలిస్తే పొగరాయుళ్లలో పదేళ్ల కాలంలో విషయగ్రహణ సామర్థ్యం వేగంగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.