ETV Bharat / snippets

బాలయ్య, బోయపాటి కాంబో ఫిక్స్- నిర్మాతగా తేజస్విని నందమూరి

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 9:52 AM IST

Balayya Boyapati
Balayya Boyapati (Source: ETV Bharat)

Balayya Boyapati BB4: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్​ఫుల్ కాంబో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను మరోసారి జతకట్టనున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం సాగినా, సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈరోజు (జూన్ 10) హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్​మెంట్ ఇచ్చారు. ఈ మేరకు బాలయ్యకు పుట్టిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'వెండితెరపై మాస్ జాతర చేసేందుకు, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ- బోయపాటి హిట్ కాంబో సిద్ధమవుతోంది' క్యాప్షన్ జోడించారు. ఈ సినిమా 'BB4' వర్కింగ్ టైటిల్​తో త్వరలోనే ప్రారంభం కానుంది. ఫ్యాన్స్ అంతా ఇది పక్కా అఖండ సీక్వెల్ అయిఉండవచ్చని అంటున్నారు. కానీ, కథ ఏంటనేది రివీల్ కాలేదు. ఈ సినిమాతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా పరిచయం కానున్నారు. కాగా, 'సింహా', 'లెజెండ్', 'అఖండ' తర్వాత ఈ కాంబోనుంచి రానున్న నాలుగో సినిమా ఇది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.