ETV Bharat / snippets

SSMB29 - కీలక అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:30 AM IST

Source ETV Bharat
mahesh rajamouli (Source ETV Bharat)

Rajamouli Maheshbabu Movie shooting : రాజమౌళి - మహేశ్​బాబు SSMB 29 సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా, అప్డేట్స్​ ఎప్పుడు ఇస్తారు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి SSMB 29కు సంబంధించి సెట్ వర్క్ చేయిస్తున్నట్లుగా తెలిపారు.సెట్ వర్క్స్ మొత్తం పూర్తైన తర్వాత సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అఫీసియల్ అనౌన్స్​మెంట్​ ఇచ్చిన తర్వాతే షూటింగ్ మొదలు కానుందని, ఇదంతా జరగడానికి మరో రెండు నెలల సమయం అయినా పెట్టొచ్చని చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రం కోసం మహేశ్ ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఎంతో స్టైలిష్​గా మారారు. అలాగే బరువు కూడా పెరిగే ప్రయత్నం చేస్తున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.