ETV Bharat / snippets

బాక్సాఫీస్​ వద్ద కల్కి జోరు- 4 రోజుల్లోనే రూ.500 కోట్లు క్రాస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 7:43 AM IST

Kalki Box Office Collection
Kalki Box Office Collection (Source: ETV Bharat)

Kalki Box Office Collection: పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కల్కి 2898 AD' మాసివ్ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. జూన్ 27న రిలీజైన సినిమాకు హిట్ రావడం వల్ల వీకెండ్​లో థియేటర్ల వద్ద రద్దీ మరింత పెరిగింది. ఓపెనింగ్ రోజే రూ.191.50 కోట్లు వసూల్ చేసిన సినిమా రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు చేరువైంది. వీకెండ్​లో మూవీ ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవ్వడం వల్ల వసూళ్లు పెరిగాయి.

ఈ సినిమా 4రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కల్కి రూ.500+ కోట్లు వసూల్ చేసిన ఐదో తెలుగు సినిమాగా నిలిచింది. ఇంతకుముందు బాహుబలి- 1, 2, ఆర్ఆర్ఆర్, సలార్ ఈ ఫీట్ అందుకున్నాయి. కాగా అందులో నాలుగు ప్రభాస్​వే కావడం విశేషం. మరో రెండు వారాలు కల్కిదే జోరు ఉంటుందని, రూ.1000+ వసూళ్లు చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.