స్మశాన వాటిక ఏర్పాటు చేశాక ఓట్ల కోసం రండి! కడపలోని ఓ గ్రామంలో వెలసిన ఫ్లెక్సీలు - Ysr District Voters Flexi - YSR DISTRICT VOTERS FLEXI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:32 PM IST

Ysr District Voters Flexi About Demands: ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ప్రజలు అవసరం, ఎలక్షన్లు అయిపోయిన తరువాత ప్రజలతో నాకేంటీ అవసరం అనుకునే రాజకీయ నాయకులకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. రాజకీయ నేతల రూట్​లోకే వచ్చి మా డిమాండ్ పరిష్కరిస్తేనే ఓటు అడగండి అని తేల్చి చెప్పారు. ఐదేళ్లలో ఏనాడు గ్రామాల మొహం చూడని రాజకీయ నాయకులు నేడు ఓట్ల కోసం వెళ్తున్న రాజకీయ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఈ అనుభవాలు ఎదురవుతుండటం గమనార్హం.

వైయస్సార్ జిల్లా సిద్ధవటం మండలం కడపాయ పల్లె గ్రామంలోని హరిజనవాడకు చెందిన ప్రజలు తమ గ్రామానికి స్మశాన వాటిక ఏర్పాటు చేసిన తర్వాత ఓట్లు అడిగేందుకు ఏ రాజకీయ పార్టీ నాయకులైన గ్రామానికి రావాలని గ్రామం ద్వారం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ గ్రామానికి ఓట్లు అడిగేందుకు ఏ రాజకీయ నాయకులు వెళ్లెందుకు సుముఖత చూపించటం లేదు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడిగి అధికారం చేపట్టిన తర్వాత తిరిగి ఐదేళ్ల వరకు గ్రామం వైపు చూడడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కూడా  స్మశాన వాటిక లేదని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.