వేడుకల కోసం గుర్రానికి శిక్షణ ఇస్తూ ప్రమాదం - యువకుడు మృతి - Young Man Fell off Horse and Died - YOUNG MAN FELL OFF HORSE AND DIED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 10:47 PM IST
Young Man Died After Falling From Horse While Giving Training: సంప్రదాయంగా వస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు గుర్రానికి శిక్షణ ఇస్తూ ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని మద్దికేరలో ఏటా దసరా రోజు గుర్రపు పందాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి, రామలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు పృథ్వీరాజ్ (29) గుర్రానికి శిక్షణ ఇచ్చే క్రమంలో మద్దికేర నుంచి బొజ్జనాయునిపేట గ్రామానికి గుర్రంపై వెళ్తుండగా అనుకోకుండా పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితున్ని హూటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు గుర్రంపై నుంచి పడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత ఏడాది దసరా రోజున జరిగిన గుర్రాల ప్రమాదంలో వీరి కుటుంబానికి చెందిన మాణిక్య రాయుడు సైతం ప్రమాదానికి గురయ్యాడు. అతను ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడు అదే కుటుంబంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.