నామినేషన్ వేసేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడి- నలుగురికి గాయాలు - YCP workers attacked TDP workers

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 7:41 PM IST

YCP workers attacked TDP workers:  పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం ఉదయం సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ కార్యక్రమానికి వెళుతున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పెద్దమక్కెనలో ఓ పెట్రోలు బంకులో టీడీపీ శ్రేణులు పెట్రోలు కొట్టించుకుంటుండగా, వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడిలో నలుగురు టీడీపీ శ్రేణులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి  చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల చేతిలో గాయపడిన వారు మట్టుపల్లి మేరి బాబు (35), జెడ్ల చిన్న నాగరాజు (32), మట్టుపల్లి సంగీత రావు, జరుగుమల్లి ఏసు (40) లుగా టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఓటమి బయంతోనే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొవాల్సి వస్తుందని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.