రాష్ట్రంలో నీచ రాజకీయాలు - వైసీపీ నేత చీరెలను పంచిన అధికారులు : టీడీపీ - నీచ రాజకీయాలకు తెర లేపిన వైసీపీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 1:29 PM IST
YCP Leaders Using Officers For Party Activities: రాష్ట్రంలో నీచ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెర లేపారు. గుంటూరు జిల్లా కాకుమానులో వెలుగు యానిమేటర్లకు సంబంధిత అధికారి చీరలు పంపిణీ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్ గత నెలలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెలుగు యానిమేటర్లకు చీరలను పంపిణీ చేయమని ఆయన కార్యాలయాలకు చీరలను పంపించారు. కానీ ఆ చీరలను అప్పుడు పంపిణీ చేయలేదు.
కాకుమానులో గురువారం ఆసరా కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రెండు వేల మంది మహిళలను తీసుకురావాలని యానిమేటర్లను ఆదేశించారు. కిరణ్ కుమార్ చీరలను పంపించారని యానిమేటర్లకు రహస్యంగా అందజేసి ఆసరా కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపినట్లు సమాచారం. రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీ తొత్తులుగా మారడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో చీరలు పంపిణీ చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.