అంబటివలసలో ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - Two People Dead in Accident - TWO PEOPLE DEAD IN ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:15 PM IST
Two People Dead Was Road Accident in National Highway : విజయనగరం జిల్లా అంబటివలస సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను విజయనగరం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబటివలస సమీపంలో విజయనగరం, గజపతినగరం నుంచి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొన్నాయి.
Two People Seriously Injured In Road Accident : ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వాహనంపై వెనుక కుర్చున్న వారికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృత్యులు ఇద్దరిలో ఒకరు విజయనగరం కణపాక ప్రాంతానికి చెందిన నరసింహమూర్తి, మరొకరు బీహర్‌కు చెందిన రెహన్ హలంగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.