సప్తగిరి అతిథి గృహంలో టీటీడీ ఈవో తనిఖీలు- అధికారులకు మెమోలు - TTD EO Syamala Rao Inspection - TTD EO SYAMALA RAO INSPECTION
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 10:30 AM IST
TTD EO Syamala Rao Inspection in Saptagiri Rest House : తిరుమలలో గదుల ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సప్తగిరి అతిథి గృహంలో గదులు బాగలేవంటూ భక్తులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈవో, అదనపు ఈవో అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. సప్తగిరి అతిథి గృహంలోని కొన్ని గదులకు సంబంధించి ఇంజినీరింగ్ నిర్వహణ బాగాలేదంటూ అధికారులపై శ్యామలరావు, వెంకయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సంబంధిత అధికారులకు మెమోలను జారీ చేయాలని ఆదేశించారు.
కేంద్రీయ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను తనిఖీ చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రానికి చేరుకుని అన్న ప్రసాదాల నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎస్2 సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, శ్రీనివాసులు, డీఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, అన్నదానం డిప్యూటీ ఈవో రాజేంద్ర, డిప్యూటీ ఈవో ఆర్2 హరీంద్రనాథ్, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, ఏఈవో నాయుడు పాల్గొన్నారు.