ఉప్పొంగిన వాగులు - గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు - flood water in Tribal villages - FLOOD WATER IN TRIBAL VILLAGES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 4:21 PM IST
Tribal Villages Trapped in Flood Water due to Heavy Rains : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా కొన్ని గ్రామాలు మాత్రం ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరదలు పొంగిపొర్లుతుండటంతో గ్రామాలకు వెళ్లేందుకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని బొర్రచింత గిరిజన గ్రామానికి వెళ్లే దారిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలచి స్ధానికులు అష్టకష్టాలు పడుతున్నారు.
చివరికి నిత్యవసర సరుకులు అందని పరిస్థతి నెలకొంది. కొందరు సాహసం చేసి ప్రమాదకరమైనా వాగులు దాటి సరుకులు తెచ్చుకుంటున్నారు. వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లటం లేదు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం మండల కార్యదర్శి దొర అతి కష్టం మీద గ్రామానికి చేరుకొని గిరిజనులకు మద్దకు పలికారు. అనంతరం స్థానికులతో కలిసి వాగులో దిగి నిరసన వ్యక్తం చేశారు. బొర్రచింత గ్రామానికి రహదారి నిర్మించి, బొడ్డగుమ్ము గెడ్డపై వంతెన నిర్మించాలని కొరారు.