'వైఎస్సార్సీపీకి ఫ్యాన్​ కాదు గొడ్డలి గుర్తు కేటాయించాలి' - Atchannaidu Fires on ysrcp govt

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 11:29 AM IST

TDP state president Atchannaidu On Telugu Desam activist Munaiah Murder : తెలుగుదేశం కార్యకర్త మునయ్యపై వైఎస్సార్సీపీ  వర్గీయులు గొడ్డలితో దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వైఎస్సార్సీపీ (YSRCP) రాక్షస జాతికి చెందిన పార్టీ అని మండిపడ్డారు. మునయ్యను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

TDP Leaders will Resist YSRC Attacks, says Atchannaidu : అధికారం కోల్పోతున్నామనే  అక్కసుతోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు నరమేధం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై దాడులు, హత్యలు చేసిన ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపించిన జగన్‌ను (Jagan) ఆ పార్టీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో (Elections) వైఎస్సార్సీపీకి ఫ్యాన్‌ గుర్తుకు బదులు గొడ్డలిని గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.