50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం: టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు - TDp leader Kalava Srinivas
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 2:16 PM IST
F2F with TDP Leader Kalava Srinivasulu in Rayadurgam : జీన్స్ పరిశ్రమ యజమాని అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి రాయదుర్గం జీన్స్ వస్త్రాలకు నాణ్యత లేదని ప్రచారం చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తానని సీఎం జగన్ దొంగ హామీలిచ్చారని మండిపడ్డారు. తాను గెలుపొందిన వెంటనే భైరవానితిప్ప జలాశయానికి కృష్ణా జలాలు తరలించే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
రాయదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల వలసలు ఆపడానికి తన వంతు కృషి చేస్తానని కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. జీన్స్ పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తింపు తెస్తామని పేర్కొన్నారు. ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి యువకులకు ఉపాధి, ఉద్యోగం అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయిదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో కనీస అవసరాలు, కరెంటు చార్జీల పెరుగుదలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. రాయదుర్గంలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక లాంటిదని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాయదుర్గంలో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.