LIVE: ‘కలలకు రెక్కలు’ పథకంలో విద్యార్థినుల రిజిస్ట్రేషన్ - పాల్గొన్న చంద్రబాబు - Kalalakurekkalu Scheme
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 1:11 PM IST
|Updated : Mar 13, 2024, 2:31 PM IST
Student Enrollment Program in 'Kalalakurekkalu' Scheme: ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఆశయంతో 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. కలలకు రెక్కలు పథకంలో పేరు నమోదు కోసం kalalakurekkalu.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 'కలలకు రెక్కలు' ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ‘కలలకు రెక్కలు’ పథకంలో భాగంగా విద్యార్థినుల రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu) పాల్గొంటున్న సందర్భంగా ప్రత్యక్షప్రసారం.
Last Updated : Mar 13, 2024, 2:31 PM IST