ఫరూఖ్​ను పరామర్శించిన పలువురు నేతలు- ప్రాణాపాయం లేదన్న వైద్యులు - Some LEADERS VISIT IN FAROOQ - SOME LEADERS VISIT IN FAROOQ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 9:20 AM IST

Some leaders visit Nandyal Hospital in Farooq: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్​ నంద్యాలలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ముక్కు లోపలి భాగం గాయమైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని రకాల స్కానింగ్​లు చేయించారు. ఫరూఖ్​కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాధమికంగా తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న ఫరూఖ్​​ను టీడీపీ నేతలు బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్​ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ ఛైర్ పర్సన్ మాబున్ని, పలువురు వైసీపీ నాయకులు ఫరూఖ్​​ను పరామర్శించారు

నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఫరూఖ్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న ఎన్ఎండి ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం అతనిని నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.