ప్రేమ పేరుతో యువతి మోసం: యువకుడి ఆత్మహత్యాయత్నం - Nallapadu Employee Suicide Attempt
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 10:47 AM IST
Software Employee Commit Suicide By Girl Cheating at Nallapadu: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు. కాలేజీ రోజుల్లో పరిచయమైన అమ్మాయితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నానని, నిశ్చితార్థం కూడా జరిగింది బాధితుడు పేర్కొన్నాడు. యువతి పెళ్లి చేసుకోకపోగా తనపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురు చేస్తోందని యువకుడు వాపోయాడు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నల్లపాడులో పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఓ యువతితో నిశ్చితార్ధం జరిగిందని, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోకపోవడం లేదని పైగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని యువతి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల్లో పరువు పొయిందని, బతకడం ఇష్టలేక చనిపోయేందుకు పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు బాధిత యువకుడిని జీజీహెచ్ (Government General Hospital)కి తరలించారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.