కోనసీమకు పొగమంచు సొబగులు- ఇబ్బందుల్లో వాహనచోదకులు
🎬 Watch Now: Feature Video
Snow Effect in Konaseema District: కోనసీమ జిల్లాలో పొగ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలోని అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో ఓ మాదిరి వర్షంలా ఈ మంచు కురవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజాము నుండి పొగ మంచు విపరీతంగా కమ్మేయడంతో రహదారులను గుర్తించడం వాహనదారులకు కష్టంగా మారింది. చెట్లపై కురుస్తున్న మంచు, పక్షుల కిలకిల రాగాల నడుమ ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు ఈ అందాలను ఆస్వాదించారు. రహదారులన్ని మంచుతో కప్పేయడంతో వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
People Suffering With Snow: మంచు ఎక్కువగా కురవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, జనం కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు పుల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. జాతీయ రహదారిపై కూడా చాలా నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర రహదారుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.