పార్టీ సమావేశాల్లో కుటుంబ సమస్యల ప్రస్తావన సరికాదు : వైవీ సుబ్బారెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 10:54 AM IST

Senior YCP Leader YV Subbareddy Countered YS Sharmila Comments : జగన్‌పై ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కుటుంబ సమస్యలను పార్టీ సమావేశాల్లో ప్రస్తావించి వాటికి జగనే బాధ్యుడనటం సరికాదన్నారు. Y.S రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కక్షపూరితంగా జగన్‌పై కేసులు మోపి 16 నెలలు జైల్లో పెట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీలో చేరిన షర్మిల కూడా అదే అనవాయితీని కొనసాగిస్తోందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్​ పార్టీ వైఎస్​ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ పార్టీ కుట్ర పూరితంగా జగన్​పై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి పేరును కాంగ్రెస్​ పార్టీ చార్జ్​ షీట్​లో​ చేర్చి ఏ విధంగా అవమానించిదో రాష్ట్ర ప్రజలు మరిచిపోరని తెలియజేశారు. రాష్ట్రానికి ఇప్పుడు కూడా రాజధాని లేకపోవడానికి కారణం కాంగ్రెస్​ పార్టీనే అని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.