తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు - సప్త వాహనాల్లో విహరించనున్న మలయప్ప స్వామి - తిరుమలలో రథ సప్తమి వేడుకలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 12:09 PM IST
Rathasaptami Celebrations in Tirumala : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు (Rathasaptami celebrations) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్లొన్నారు. వేడుకల సందర్భంగా సప్తవాహనాల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలను గ్యాలరీ నుంచి భక్తులు వీక్షించేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇవాళ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ఈ రాత్రి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగు రంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరణలు చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది.