ప్రైవేట్ విద్యాసంస్థ బస్సు కనిపించిందా? జగన్ సభకు తరలించేయ్- అధికారుల హుకుంతో యాజమాన్యాలకు ముచ్చెమటలు - YCP Siddham Meetings
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 4:18 PM IST
Private School Buses Move To CM Jagan Meeting : సీఎం జగన్ వస్తున్నారు అంటే చాలు ప్రయాణికులకే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ప్రాణసంకటంగా మారింది. ప్రైవేట్ విద్యా సంస్థల బస్సు కనిపిస్తే చాలు వాటిని జగన్ సభకు జనాల్సి తరలించేందుకు ఆదేశాలు ఇస్తున్నారు అధికారులు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగబోయే జగన్ సభకు (CM Jagan Siddham Meeting) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని భారీగా ప్రైవేటు పాఠశాలు, కళాశాల బస్సుల ద్వారా జనాన్ని తరలించారు. వైసీపీ నిర్వహించే సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు బస్సులు పంపాలని లేకపోతే ఇబ్బందులు తప్పవనే రీతిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను అధికారులు ఒత్తిడి చేశారు. ప్రైవేటు స్కూల్స్‌కు, కళాశాలలకు సెలవు ఇచ్చి మరీ వారి సభలకు బస్సులను తరలిస్తున్నారు. బస్సులు పంపకపోతే ఆ తర్వాత తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని యాజమాన్యాలు వాపోతున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల, కళాశాలలకు చెందిన వందలాది బస్సులను యాజమాన్యాలు రవాణా అధికారులకు అప్పగించారు. ప్రొద్దుటూరులో పాఠశాలల బస్సులకు వైసీపీ జెండాలు కట్టి జనాన్ని తరలించారు. వైసీపీ నిర్వహించే కార్యక్రమాలకు పాఠశాలల బస్సులు పంపాలని అధికారులు చెప్పడంతో తమకు తప్పడంలేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.