'పుష్ప' తరహాలో గంజాయి తరలింపు - 912 కిలోలు స్వాధీనం - POLICE SEIZED GANJA - POLICE SEIZED GANJA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-08-2024/640-480-22300917-thumbnail-16x9-ganja.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 7:23 PM IST
Police Seized Ganja Lorry in Anakapalli District : అనేక నేరాలకు మూలకారణమవుతున్న గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నా అక్రమార్కులు బెదరడం లేదు. తనిఖీలు ముమ్మరం చేస్తూ దొరకిపోతున్నా వెనక్కి తగ్గడం లేదు. రోజుకో కొత్త మార్గంలో గంజాయిని సరఫరా చేస్తూనే ఉన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి వద్ద పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 912 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'పుష్ప' సినిమా తరహాలో 456 గంజాయి ప్యాకెట్లను లారీ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో దాచి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి విలువ సుమారు 55 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని ఎస్పీ దీపిక తెలిపారు. నిందితులు తెలంగాణ, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణా అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ దీపిక వెల్లడించారు.