LIVE: విజయవాడ వెస్ట్ పంజా సెంటర్లో పవన్ కల్యాణ్ బహిరంగ సభ- ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan Public Meeting - PAWAN KALYAN PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 8:13 PM IST
|Updated : May 9, 2024, 9:32 PM IST
Pawan Kalyan Public Meeting in Vijayawada West Live: ఆత్మగౌరవం ఉన్నవారు దాస్యం చేయలేక వైఎస్సార్సీపీ నుంచి బయటకి వస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. యార్లగడ్డ వెంకట్రావ్, వల్లభనేని బాలశౌరి అందుకే వైఎస్సార్సీపీకి దూరమయ్యారని తెలిపారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్తపై దాడి జరిగితే బాలశౌరి స్పందించిన తీరు అభినందనీయమన్నారు. వల్లభనేని వంశీ వివేకం ఉన్న నాయకుడు అనుకున్నానన్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లో నాయకుల మధ్య విభేదాలు వుంటాయని, విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి కానీ దిగజారి బూతులు తిట్టకూడదని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఆ విధంగా మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. భువనేశ్వరిని అంటే తన తోబుట్టువును అన్నట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకి జనసేన మద్దతుదారులు ఓటు వేస్తే మహిళలను కించపరిచే వారికి మద్దతు ఇచ్చినట్లేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఓడిపోయిన తరువాత యార్లగడ్డ అమెరికా వెళ్లిపోవచ్చు కానీ ప్రజలకూ అండగా ఉండాలని ఇక్కడే వుంటున్నారని తెలిపారు. విపక్షాల కుటుంబసభ్యులను తిట్టలేకే యార్లగడ్డ వైఎస్సార్సీపీ నుంచి బయటకి వచ్చారన్నారు. కాగా ప్రస్తుతం విజయవాడ వెస్ట్ పంజా సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రత్యక్షప్రసారం.
Last Updated : May 9, 2024, 9:32 PM IST