thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 5:40 PM IST

Updated : May 5, 2024, 6:15 PM IST

ETV Bharat / Videos

LIVE తునిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan Meeting Live

Pawan Kalyan Public Meeting in Tuni Live: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శనివారం అవనిగడ్డ, రేపల్లె, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. అధికార వైసీపీ అయిదేళ్ల పాటు సాగించిన అరాచకాలు, అభివృద్ధి నిరోధక విధానాలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలు, అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు, మ్యానిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. పవన్‌ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో జోష్‌ నింపింది. వైసీపీ ఆరాచక పాలనకు అంతం పలకాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. వైసీపీని ఓడించే సమయం ఆసన్నమైందని ఆ పార్టీని ఓడించకపోతే యువత ఉపాధి ఉండదన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే  ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నేడు పొన్నూరులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర తరఫున పవన్‌ ప్రచారం చేస్తున్నారు. సందర్భంగా తునిలో పవన్‌కల్యాణ్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : May 5, 2024, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.