thumbnail

LIVE: పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్​ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Pawan Kalyan participated in Palle Panduga Program: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే 'పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాలు' రాష్ట్రవ్యాప్తంగా నేటి ప్రారంభం అవుతున్నాయి. 4 వేల 500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను "పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు" పేరిట ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించారు. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 30 వేల ప‌నుల‌ు చేపట్టాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25 వేల నీటి కుంటలు, 22 వేల 525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30 వేల ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో 'పల్లెపండుగ–పంచాయతీ వారోత్సవాల్లో' భాగంగా అన్ని రకాల పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కల్యాణ్​ పాల్గొన్నారు. పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం సభలో పాల్గొంటారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.