LIVE గిద్దలూరులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - Pawan Election Campaign - PAWAN ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 4:57 PM IST
|Updated : May 3, 2024, 5:20 PM IST
Pawan Kalyan Election Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరికన్న పవన్ సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయన్నారు. 430 కేసులు నమోదు చేసి మీడియాను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారన్నారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే దోచుకుంటారా? వంద గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టాలా అని పవన్ ప్రశ్నించారు. గిద్దలూరు నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 3, 2024, 5:20 PM IST