"పట్టిసీమ" పరవళ్లు- పది మోటార్ల నుంచి 3540 క్యూసెక్కుల నీటి విడుదల - Pattiseema Water Release - PATTISEEMA WATER RELEASE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 12:44 PM IST
Pattiseema Water Release For Needs Krishna Delta Farmers : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి నిల్వల కారణంగా ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల వద్ద జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్టు నుంచి 10 మోటర్ల ద్వారా 3540 క్యూసెక్కుల నీటిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విడుదల చేశారు. భారీ వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో నీటి మట్టంపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాలు నుంచి పెద్ద ఎత్తున నీటి నిల్వలు చేరుతుండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో కృష్ణా డెల్టా రైతుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. గత రెండు రోజులుగా తగ్గిన వరద ప్రవాహం గురువారం మళ్లీ పెరగడంతో నీటిని రైతుల అవసరాల కోసం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌లోని 10 పంపులు ద్వారా నీటిని విడుదల చేశారు.