రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయం-బాలినేనికి అధిష్టానం షాక్? - వైఎస్సార్సీపీ ఐదో జాబితా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 9:11 PM IST

Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒంగోలు సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్సార్సీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ యత్నిస్తున్నట్లు సమాచారం. బాలినేనిని గిద్దలూరు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డికి ఒంగోలు లోక్‌సభ సీటు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని  ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ పెద్దలతో చర్చల అనంతరం తన భవిష్యత్‌ కార్యాచరణపై బాలినేని తన కుటుంబసభ్యులతో చర్చిస్తున్నారు.  

జగన్ కోసం మంత్రి పదవి సైతం:  ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలనే శాసించిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాభవం రోజురోజుకు మసకబారుతోంది. వైఎస్‌ కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతోపాటుగా, మంత్రి పదవి సైతం వదులుకుని జగన్‌ వెంట నడవడిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ జిల్లాలో బాలినేని పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడం వెనువెంటనే మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. అలాగే  అటు జిల్లాలోనూ అటు పార్టీలోనూ ఆయన చక్రం తిప్పారు.  కానీ కొన్ని రాజకీయ కారణలు, ఆరోపణల నేపథ్యంలో బాలినేని సీఎం జగన్ దూరం పెడుతూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.