వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు - పొగమంచు కారణంగా కారు బోల్తా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 12:53 PM IST
|Updated : Feb 29, 2024, 1:03 PM IST
Old Woman Died in Road Accident at Pamarru Mandal: కృష్ణా జిల్లా పామర్రు మండలం అడ్డాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి (Injured). రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొనడంతో (Lorry Collides Auto) ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టడంతో పోలవరం గ్రామానికి చెందిన దేవరకొండ యశోదమ్మ (65) మృతి చెందారు. క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident in Alluri Seetharama Raju District: అల్లూరి జిల్లా పాడేరు మండలం నక్కలపుట్టు వద్ద పెళ్లి కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా వధూవరులతో పాటు మరో నలుగురు క్షేమంగా బయటపడ్డారు. చోడవరం నుంచి అరకులోయ వెళ్తుండగా పొగ మంచు (fog) కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది క్షతగాత్రులు తెలిపారు.